-

1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పోస్‌ అమలు

23 Sep, 2016 23:23 IST|Sakshi
అత్తిలి : పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో చేపట్టిన ఈ–పోస్‌ విధానంలో ఎరువుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని వ్యవసాయశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ బీజీవీ ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం అత్తిలిలో వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 1,100 మంది ఎరువుల డీలర్లకు ఉచితంగా ఈ–పోస్‌ యంత్రాలను అందజేసి శిక్షణ ఇచ్చామని, వాటి ద్వారానే రైతులకు ఎరువుల విక్రయాలు జరుపుతున్నారని చెప్పారు. అక్టోబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా 816 జిల్లాల్లో ఈ పోస్‌ విధానంలో ఎరువుల విక్రయాలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో 13 మండల వ్యవసాయశాఖ కార్యాలయ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయని వ్యవసాయశాఖాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కమాలాకర్‌ చెప్పారు. అత్తిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 2 ఏడీఏ కార్యాలయాలు, జేడీ కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
 
మరిన్ని వార్తలు