మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..

13 Nov, 2023 13:28 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

వైరల్‌గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. 

రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను  ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!

 

మరిన్ని వార్తలు