ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

1 Sep, 2016 23:48 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పెంచినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లను సంప్రదించి, వారి లాగిన్‌–ఐడీ ద్వారా తమ దరఖాస్తును ఆన్‌లైన్‌ చేయించుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ చేయించిన తర్వాత వచ్చిన రెఫరెన్స్‌ నంబర్‌ ఆధారంగా ప్రవేశ ఫీజును మీసేవ, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాలని కోరారు.

మరిన్ని వార్తలు