మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి

12 Dec, 2016 15:15 IST|Sakshi
మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి
ఐటీడీఏ పీవో ఏఎస్‌ దినేష్‌కుమార్‌
రంపచోడవరం : వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వీలు కలుగుతుందన్నారు. రైతులను భూసార పరీక్షలు చేయించి సూక్ష్మ పోషకాలందించి అధిక దిగుబడిని సాధించేలా చైతన్యం చేయాలన్నారు. ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించి పూర్తిగా వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అవకాశాలను  మెరుగుపర్చాలన్నారు.  వ్యవసాయశాఖ ఏడీఏ రాబర్ట్‌పాల్, శ్రీనివాస్‌రెడ్డి , ఏపీడీ వై శంకర్‌నాయక్‌, పీహెచ్‌ఓ బి.శ్రీనివాసులు, ఈఈ వెంకటేశ్వర్లు, మైక్రో ఇరిగేషన్‌ పీడీ సుబ్బారావు, కేవీకే కో ఆర్డినేటర్‌  శ్రీనివాసు, పీఏఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాగా నోడల్‌ ఏజెన్సీలో ఉన్న పెండింగ్‌ సమస్యలను గిరిజన సబ్‌ప్లాన్‌లో పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌  మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.స్టాలిన్‌బాబు పీవో దినేష్‌కుమార్‌ను కోరారు.
టీఎస్‌పీ కింద గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం 2017–24 వరకు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం టీఎస్‌పీ కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పీవో  దినేష్‌కుమార్‌ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో టీఎస్‌పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నాబార్డు కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం సంప్రదింపులు జరిపినట్లు పీవో తెలిపారు. 
మరిన్ని వార్తలు