3.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

13 Oct, 2016 22:59 IST|Sakshi
ధవళేశ్వరం : 
కాటన్‌ బ్యారేజ్‌ నుంచి గురువారం సాయంత్రం 3,38,284 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌ వద్ద గురువారం సాయంత్రం 10.30 అడుగుల వద్ద నీట్టి మట్టం నెలకొంది. తూర్పు,మధ్య ,పశ్చిమ డెల్టాలకు 12,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి  కాళేశ్వరంలో 6.26 మీటర్లు,పేరూరులో 7.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 7.61 మీటర్లు, భద్రాచలంలో 25.30 అడుగులు, కూనవరంలో 9.14 మీటర్లు, కుంటలో 4.60 మీటర్లు, పోలవరంలో 8.79 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద  14.24 మీటర్లు వద్ద నీటిమట్టాలు నెలకొన్నాయి.
 
మరిన్ని వార్తలు