ఆరుతడి పంటలతో రైతుల్లో ఆనందం

10 Sep, 2016 23:16 IST|Sakshi
ఆరుతడి పంటలతో రైతుల్లో ఆనందం

7,015 హెక్టార్లలో సాగుచేసిన అన్నదాతలు

వికారాబాద్‌ రూరల్‌: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాత మోముల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో దోబూచులాడిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరు బావులున్న ప్రాంతాల్లో రైతులు వరి, పసుపు పంటలు సాగు చేయగా.. వర్షాధారిత ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో మండలంలోని రైతులు ఆరుతడి పంటలపై ఆశలు పెట్టుకుని.. ఆ దిశగా సాగుకు ఉపక్రమించారు. ఆయా పంటలు సాగు చేసిన రైతులకు వర్షాలు కరువయ్యాయి. దీంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న తరుణంలో.. ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల ఆశలు చిగురించాయి. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయింది. మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో రైతులు వరి 10 హెక్టార్లు, జొన్న 420, మొక్కజొన్న 2,830, పెసర 105, మినుము 75, కంది 2,300, పసుపు 305, పత్తి 720, సోయాబీన్‌ 250 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. మొత్తం కలిపి 7,015 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం పోసినట్లయిం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షం అన్నదాతలకు వరం లాంటిదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు వరుణిడి కరుణ ఉంటే నెలాఖరు నాటికి కాతకాసి పంటలు చేతికి అందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!