కరెంటు వైరు తగిలి మత్స్యకారుడు మృతి

4 Oct, 2015 14:05 IST|Sakshi

కృష్ణా(ఒంటిమిల్లు): రోడ్డుపై పడ్డ కరెంటు వైరు తగిలి ఓ మత్స్యకారుడుమృతిచెందిన సంఘటన ఒంటిమిల్లు మండలంలోని 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి లచ్చబండ మేజర్ డ్రైన్‌లో వేటకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఒంటిమిల్లు మండలం ముంజులూరు గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలడంతో ఈ సంఘటనకు కారణమైంది.

మరిన్ని వార్తలు