ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

17 Apr, 2016 20:46 IST|Sakshi
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

మందస మండలంలో దీక్షకు దిగిన   గిరిజన యువతి
నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
 
 
 
మందస : నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై ఓ గిరిజన యువతి న్యాయ పోరాటానికి దిగింది. ప్రేమ పేరుతో దారుణంగా మోసగించిన ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పాలని అతడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు...  మందస మండలంలోని పట్టులోగాం గ్రామానికి చెందిన సవర హరిశంకర్ కవిటి మండలం బొ రివంక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

అదే మండలం కుల్లోగాం కాలనీకి చెందిన సవర భూలక్ష్మి పలాసలో చదువుతోంది. తొమ్మిది నెలల కిందట వీరిద్దిరికీ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గర కావడంతో భూలక్ష్మి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని హరిశంకర్‌కు చెప్పి తనను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది.

అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో విషయం యువతి అన్నయ్య శంకర్, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు కూడా పట్టులోగాం వెళ్లి ప్రియుడి కుటుంబ సభ్యులను కలిశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మార్చి 12న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

హరిశంకర్‌ను ఎస్‌ఐ వి.రవివర్మ హరిశంకర్‌ను పిలిపించి నిలదీయగా... పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని అంగీకార పత్రం రాసి ఇచ్చారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో బాధితులు పలాస డీఎ స్పీని ఆశ్రయించారు. అయినా హరిశంకర్ గడువులు కోరుతూ విషయం దాటవేయడంతో బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భూలక్ష్మికి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ ఏడాది మార్చి 27న హరిశంకర్ ఎవరికీ తెలీకుండా కళావతి అనే యువతిని కంచిలి లోని జగన్నాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నా రు. ఆ తర్వాత ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఈ విషయం భూలక్ష్మి కి ఆలస్యంగా తెలియడంతో శుక్రవారం ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది.

మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు...
న్యాయ పోరాటానికి దిగిన సవర భూలక్ష్మికి సీపీఐఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం, నవోదయ మహిళా సంఘంతో పలు మహిళా సంఘాలు మద్దతు నిచ్చాయి. బాధితురాలికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. న్యాయం కోసం ప్రియుడి వద్దకు రాగా బాధితురాలితో పాటు ఆమెతో వచ్చిన మహిళా సంఘాల సభ్యులపై హరిశంకర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిని పలు సంఘాల ప్రతినిధులు ఖండించారు.
 
 కేసు నమోదు...
 హరిశంకర్ ఆచూకీపై మందస ఎస్‌ఐ రవివర్మ అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలికి న్యా యం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు