పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

15 Oct, 2016 21:10 IST|Sakshi
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
రామన్నపేట 
అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషిచేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శిం చారు.  ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలానిన సందర్శించి ప్రభుత్వపథకాల అమలుతీరును సమీక్షించనున్నట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత, అధికారులు అంకితభావంతో పనిచేసేవిధంగా జిల్లాను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్నిప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేవిధంగా అధికారులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.  రామన్నపేటలోని ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దనే ప్రజల మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.  
బహిరంగ మలవిసర్జన లేని మండలంగా తీర్చిదిద్దాలి
వచ్చేఏడాది మార్చి31 నాటికి రామన్నపేటను బహిరంగ మలవిసర్జనలేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రభుత్వపథకాలపై వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హరితహారం, స్వచ్ఛభారత్, ఉపాధిహామీపథకం, మిషన్‌కాకతీయ,భగీరథ పథకాల అమలుతీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్యపై ఆరా తీశారు. పలు విషయాలను ఎంపీడీఓ వారికి వివరించారు. ప్రభుత్వస్థలాలలో, కాలువలు, చెరువులగట్లపై మొక్కలునాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో నిధులులేక అసంపూర్తిగాఉన్న పాఠశాల, అంగన్‌వాడీ భవనాల వివరాలు, వంటగదులు అవసరమైన పాఠశాలలను తనకు తెలియజేస్తే నిధులు విడుదల చేయిస్తాని చెప్పారు.  మండలంలోని పీఆర్‌రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలస్థితిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. 
 ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన కలెక్టర్‌
అనంతరం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మండలకేంద్రంలోని ఏరియాఆసుపత్రిని తనిఖీచేశారు. చిల్డ్రన్‌కేర్‌యూనిట్, ప్రసూతిగది, జనరల్‌వార్డు, ప్రసూతివార్డు, పీపీయూనిట్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సమస్యలపై ఆరా తీశారు.  కలెక్టర్‌ సందర్శన సమయంలోనే రోగుల సహాయకులు భోజనాలు చేస్తున్న చోటనే పందులు తిరుగడం చూసి విస్మయానికి గురయ్యారు. ఆస్పత్రిలోని సమస్యలను ఆరోగ్యశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.  ఆమెవెంట చౌటుప్పల్‌ ఆర్డీఓ ఆర్‌. మహేందర్‌రెడ్డి,  ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, తహసిల్దార్‌ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, మండలవిద్యాధికారి ఎస్‌.దుర్గయ్య, ఏఈ ప్రశాంత్, డీటీ జె.ఎల్లేశం, ఆర్‌ఐ డి.జానయ్య, ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ సిద్దార్ద, సుజాత, సర్పంచ్‌లు నకిరేకంటి మొగులయ్య, గెగ్గెలపల్లి యాదగిరిరెడ్డిలు ఉన్నారు.
 
>
మరిన్ని వార్తలు