క్షీణిస్తున్న భూగర్భజలాలు

29 Aug, 2016 00:20 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో భూగర్భజల మట్టం వేగంగా అడుగంటిపోతున్నాయి. జిల్లా సగటు నీటి మట్టం 19.50 మీటర్లుగా నమోదైనా కొన్ని మండలాలు, గ్రామాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. అమరాపురం మండలంలో 64.16 మీటర్లలో నీళ్లు కనిపించే పరిస్థితి నెలకొంది.

అలాగే లేపాక్షి మండలంలో 61.88 మీటర్లు, రొద్దం 61.84 మీటర్లు, యాడికి 59.45 మీటర్లు, నల్లచెరువు 55.15 మీటర్లు, గాండ్లపెంట 51.12 మీటర్లు, గుడిబండ 45.64 మీటర్లు, బుక్కపట్టణం 43.95 మీటర్లు, తలుపుల 41.85 మీటర్లు, గుమ్మగట్ట 40.68 మీటర్లు, మడకశిర 39.62 మీటర్లు, తాడిమర్రి 38.78 మీటర్లు, హిందూపురం 37.02 మీ టర్లు, సోమందేపల్లి 36.75 మీటర్లు, పెద్దపప్పూరు 32.75 మీటర్లు, తాడిపత్రి 30.92 మీటర్లు... ఇలా చాలా ప్రాంతాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో బొమ్మనహాల్, బుక్కపట్నం, గాండ్లపెంట, గుత్తి, గోరంట్ల, గుడిబండ, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, మడకశిర, నల్లచెరువు, రొద్దం, సోమందేపల్లి, తాడిమర్రి, తాడిపత్రి, తలుపుల, తనకల్లు, యల్లనూరు మండలాల్లో నీటి నిల్వలు ఎక్కువగా పడిపోతున్నాయి. విస్తారంగా వర్షాలు పడకుంటే నీటికష్టం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు