అక్రమ పదోన్నతులపై మొట్టికాయ

10 Jun, 2017 00:14 IST|Sakshi
 – జీఓ 10ని  రద్దు చేస్తూ ఉత్తర్వులు
– ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు హర్షం
 
కోవెలకుంట్ల: జెడ్పీ హెచ్‌ఎంలకు అక్రమంగా ఎంఈఓలుగా పదోన్నతులు కల్పించడాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టి ఆ జీఓను రద్దు చేసినట్లు ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజయ్య చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా ఈ ఏడాది మార్చిలో  జెడ్పీ హైస్కూళ్ల  హెచ్‌ఎంఎలకు పదోన్నతులు కల్పించారన్నారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా  వాటికి సంబంధించిన జీఓ 10ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 1998వ సంవత్సరం  నుంచి ఇప్పటివరకు జరిగిన బదిలీలు, పదోన్నతులను సమగ్రంగా సమీక్షించి జూలై 14వ తేదీలోపు కోర్టుకు నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
 
మరిన్ని వార్తలు