బస్సుల అద్దెలు సకాలంలో చెల్లించాలి

23 Aug, 2016 00:16 IST|Sakshi
  • ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల   సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌
  • హన్మకొండ: ఆర్టీసీ అద్దె బస్సులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్కం ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో నెలకు రెండు సార్లు చెల్లించే అద్దె బిల్లులను ఆర్టీసీ డిపోల్లో డీజిల్‌ పోసుకుంటున్న నాటి నుంచి నెలకోసారే చెల్లిస్తున్నారన్నారు.  ప్రతి నెల 6లోగా అద్దెను చెల్లించాలన్నారు. బీఎస్‌–4 ఇంజిన్‌ బస్సులనే నడపాలనే నిబంధన అద్దె బస్సు యజమానులకు భారంగా మారిందన్నారు.  కాలం చెల్లిన 507 బస్సుల స్థానంలో పాత వారికే మళ్లీ బస్సులు పెట్టుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జగన్, ఎం.అశోక్‌రెడ్డి, మారపల్లి రాంరెడ్డి, మధుకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, హాబీబుద్దీన్, ఎ.సమ్మిరెడ్డి పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు