హడ్కో రుణాన్ని గ్రాంట్‌గా మారుస్తాం

18 Sep, 2016 01:34 IST|Sakshi
హడ్కో రుణాన్ని గ్రాంట్‌గా మారుస్తాం
 
  • నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌
నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలోని భూగర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించి హడ్కో రుణాలను గ్రాంట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రజలపై భారం లేకుండా చేస్తామని నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ఎస్‌ఈ మోహన్, ఇంజనీరింగ్‌ అధికారులతో  శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలో భూగర్భ, తాగునీటి పథకాలకు సంబంధించి 10శాతం పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. సంగం బ్యారేజీ నుంచి నీటిని పైప్‌లైన్ల ద్వారా నీటిని తీసుకువచ్చి శుద్ధిచేసి నగర ప్రజలకు అందజేస్తున్నామన్నారు. నగరంలో 32 ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు ట్యాంకులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘సాక్షి’లో ‘రుణమా..సాయమా’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వరకు ఆర్థిక భారం భరిస్తుందని, ప్రజలపై ఎటువంటి భారం లేకుండా చేస్తున్నామన్నారు. హడ్కో రుణాలను గ్రాంటు క్రింద మార్చేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారన్నారు.  ఈ సమావేశంలో ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు