వేటగాడి చేతికి చిక్కి..

12 Dec, 2016 15:05 IST|Sakshi
వేటగాడి చేతికి చిక్కి..

ఎక్కడ నుంచో వలస వచ్చి ఇక్కడ         
ప్రాణాలు కోల్పోతున్న విదేశీ పక్షులు
అతిథి విహంగాలకు కనీస రక్షణ         
కరువవుతున్న వైనం  

కాశీబుగ్గ : ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన విదేశీ విహంగాలు వేటగాళ్లకు బలైపోతున్నా రుు. అతిథి విహంగాల విషయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే పలాస-కాశీబుగ్గలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్ర దర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంతరకుడ్డ చెరువులో సైబీరియా దేశానికి చెం దిన విదేశీ పక్షులు (రత్తకన్న) వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారుు. విచక్షణారహితంగా వాటి ని చంపి సంచుల్లో వేసుకుని దర్జాగా వెళ్లిపోతున్నా అడిగే వారు లేకపోయారు. చెరువుల్లో పంటపొలాల్లో మాటువేసి దొరికిన గువ్వపిట్టను పాదంతో తొక్కిపట్టి చంపుతున్న వైన సా క్షి కెమేరాకు చిక్కింది. దీన్ని చూసిన స్థానికులు చింతాడ మాధవరావు, పైల చిట్టి, ప్రతాప్‌కుమార్‌లు పక్షిని పరిశీలించి వారిని మందలిం చారు. వారంతా దీన్ని రత్తకన్న పక్షిగా గుర్తిం చారు. అప్పటికే వేటగాళ్లు నాలుగు గువ్వపిట్టల పీక నులిపి చంపారు.

టెక్కలి మండలం తేలి నీలాపురం ప్రసిద్ధ విదేశీపక్షులు కేంద్రం నుంచి ఆహారం కోసం సముద్ర తీరం గుండా కొన్ని వివిధ ప్రాంతాలకు వస్తుంటారుు. ఇప్పుడిప్పుడే పలాస, పూండి వంటి ప్రాంతాలకు చల్లని వాతావరణం కోసం వలస వస్తున్నారుు. ఈ పరిస్థితి గమనించిన వేటగాళ్లు వీటిని వేటాడి చంపేస్తున్నారు. వీరు పలాసలోనే నివాసముం టున్నట్లు సమాచారం. పూర్తిగా తుప్పు పట్టిన, గుర్తింపులేని ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. పక్షుల వేటనే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబాలు ప్రతి నెలరోజులకు ప్రాంతాలు మారుతుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి పక్షులను కాపాడాలని, పక్షిజాతిని కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు