రాకాసి మొసలి

10 Sep, 2023 11:54 IST|Sakshi

ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు.

యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు