అభివృద్దిలో నంబర్‌ వన్‌ చేస్తాం

14 Oct, 2016 12:23 IST|Sakshi

వనపర్తి ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక
ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి, పరిష్కరిస్తాం
మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, హరితహారంపై ప్రత్యేక దృష్టి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ శ్వేతామహంతి
సాక్షి, వనపర్తి

చిన్న జిల్లాగా ఉన్న వనపర్తిని అభివృద్ధిలో రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తా.  ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం.  ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడుతున్నాం.’ అని జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి పేర్కొన్నాం. గురువారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలు ఆమె మాటల్లో..  


వనపర్తి జిల్లాకు కలెక్టర్‌గా రావడం సంతోషంగా ఉంది. జిల్లాలో భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. చిన్న జిల్లాగా వనపర్తిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తాం. కొన్ని రోజుల్లో జిల్లాకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ వస్తాయి. వాటిని పరిశీలించి, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తాం.


అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అర్హలైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. పేదలకు పథకాలు దక్కకుండా ఎవరైనా అడ్డుపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మిషన్‌ భగరీథ, మిషన్‌ కాకతీయ, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని విజయవంతం చేస్తాం. చిన్నపిల్లలకు సకాలంలో ఇమ్యూనైజేషన్‌ టీకాలు ఇప్పించటంతో పాటు గర్భిణీలు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రిలో అన్ని వసతులు కలిస్తాం.


విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వీఆర్‌ఏలు గ్రామాల్లోనే ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. వనపర్తి జిల్లాకు ఎన్నో దశాబ్దాల నుంచే ఎడ్యుకేషన్‌lహబ్‌గా మంచి పేరుంది. దీన్ని పెంచేందుకు విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

మరిన్ని వార్తలు