ఎంపీఈఓ పోస్టుల భర్తీకి 12న ఇంటర్వ్యూలు

8 May, 2017 23:11 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): ఉద్యానశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపీఈఓ పోస్టుల భర్తీకి ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.  ఈమేరకు సోమవారం..ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో 62 ఎంపీఈఓ పోస్టుల భర్తీకి బీఎస్సీ బాటనీ అభ్యర్థులు 239 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు ఎంపికయిన అభ్యర్థుల వివరాలు కర్నూలు జిల్లా వెబ్‌సైట్‌  www.kurnool.gov.inలో పెట్టామని అభ్యర్థులు చూసుకోవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలకు 12న ఉదయం 8 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
 
మరిన్ని వార్తలు