ఎంపీ మిథున్‌రెడ్డి కృషి వల్లే ఆర్‌యూబీ

11 Aug, 2016 11:27 IST|Sakshi
ఎంపీ మిథున్‌రెడ్డి కృషి వల్లే ఆర్‌యూబీ

రాజంపేటః రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి వల్లే రాజంపేటకు ఆర్‌యూబీ (రైల్వే అండర్‌ బ్రిడ్జి) మంజూరైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్‌యూబీ నిర్మిత ప్రదేశాన్ని పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాయల్లారెడ్డితో కలిసి సందర్శించారు.

ఈసందర్భంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ ఈ యేడాది రైల్వే బడ్జెట్‌ నిర్వహించిన క్రమంలో రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్పందించి ఆర్‌యూబీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.  రైల్వే , ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంగా త్వరితగతిన ఆర్‌యూబీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌యూబిని మంజూరు చేసి నిర్మించడం వల్ల రాయచోటి–రాజంపేట మార్గంలో రాకపోకలు సులభతరంగా కొనసాగుతున్నాయన్నారు. అలాగే రాజంపేటకు కేంద్రీయ విద్యాలయంను తీసుకురావడంలో ఎంపీ మిథున్‌రెడ్డి కృషిని ఆయన గుర్తు చేశారు. ఇలా రాజంపేటకు అభివృద్ధికి తన వంతుగా ఎంపీ కృషి చేస్తున్నారన్నారు.  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలను తామే తీసుకొచ్చినట్లుగా ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ఈ పథకాల గురించి మంత్రులను కలిసారా అని ప్రశ్నించారు.
.

మరిన్ని వార్తలు