జానపదం..కోలాటం

29 Aug, 2016 23:45 IST|Sakshi
తాళంభజన పోటీలో కళాకారులు
  • సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం
  • సత్తుపల్లి టౌన్‌: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సత్తుపల్లిలో రాష్ట్ర స్థాయి జానపద నృత్యాలు, పాటలు, కోలాటం, తాళం భజన పోటీలు ప్రారంభమయ్యాయి. డీఎస్పీ బి.రాజేష్, తహసీల్దార్‌ దొడ్డా పుల్లయ్య, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంపీడీఓ ఎన్‌.రవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, తాళంభజన , కోలాటం పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డీఎస్పీ రాజేష్‌ మాట్లాడుతూ..అంతరించి పోతున్న కళలను ఆదరించాలని, ప్రాణంపోయాలని కోరారు. కార్యక్రమంలో కళాకారులు ఐక్యవేదిక అధ్యక్షులు రంగపూరి వెంకటేశ్వరరావు, జానపద కళాకారుల సంఘం డివిజన్‌ అధ్యక్షులు పి.సాయిశ్రీనివాస్, బత్తుల పూర్ణచంద్రరావు, టి.రాందాసు, కె.పెద్దిరాజు, కూసంపూడి అచ్యుతవాణి, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, పాటిబండ్ల రామకృష్ణ, కోటేశ్వరరావు, రహీం పాల్గొన్నారు. 
     
    29ఎస్‌పిఎల్‌24, రైటప్‌: తాళంభజన పోటీలో కళాకారులు
    ఫోటో నెంబరు: 29ఎస్‌పిఎల్‌23, రైటప్‌: జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు 
మరిన్ని వార్తలు