ఆర్‌యూలో కవితోత్సావం

23 Aug, 2016 00:29 IST|Sakshi
ఆర్‌యూలో కవితోత్సావం
కర్నూలు(హాస్పిటల్‌): ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు రక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాయలసీమ యూనివర్సిటీలో కృష్ణాపుష్కర కవితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50 మంది కవులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్‌ వై. నరసింహులు మాట్లాడుతూ పర్యావరణంతోపాటు సంస్కృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. శతావధాని, బహుగ్రం«థకర్త గండ్లూరి దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ పుష్కర సంస్కతి ప్రారంభమైన విధానాన్ని వివరించారు. పుష్కరాల్లోని ఆంతర్యాన్ని గమనించాలని చెప్పారు. విభిన్న సంస్కృతుల సమాహారమైన భారత దేశంలో ప్రతి సంçస్కృతికీ తనదైన విశిష్టత ఉందన్నారు. కార్యక్రమంలో గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు చంద్రశేఖర్‌ కల్కూర, తెలుగుభాషావికాస ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు