ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు

5 Feb, 2017 23:29 IST|Sakshi
  • కొత్తూరు బ్లో అవుట్‌పై స్థానికుల ఆందోళన
  • ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సంఘీభావం
  • సమస్యల పరిష్కారానికి ఓఎ¯ŒSజీసీ అధికారుల హామీ
  • ఆలమూరు : 
    జిల్లాలోని నగరంలో జరిగిన బ్లో అవుట్‌ నుంచి ఎదురైన అనుభవాలను పట్టించుకోకుండా ఓఎ¯ŒSజీసీ తమ ఆదాయ వనరుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్‌లో నెలకొల్పిన చమురు, సహజవాయువు బావి నుంచి శనివారం రాత్రి బ్లో అవుట్‌ను తలపించేలా కొద్ది నిమిషాల పాటు దట్టమైన మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొత్తూరు కాలనీ వాసులు ఆలమూరు–మండపేట రోడ్డుపై రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను స్తంభింప చేయడంతో పాటు ఓఎ¯ŒSజీసీ ప్రవేశద్వారం వద్ద ధర్నా చేశారు. వంటావార్పు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  శనివారం రాత్రే ప్రమాదం జరిగినప్పటికీ ఓఎ¯ŒSజీసీ అధికారులెవ్వరూ తమను పరామర్శించేందుకు రాలేదని తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. . ఓఎ¯ŒSజీసీ అధికారులు వచ్చి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకూ బాధితులు చేస్తున్న ఆందోళనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
    డిమాండ్లను నెరవేర్చేందుకు 
    స్పష్టమైన హామీ
    కొత్తూరు కాలనీ బాధితులు ఓఎ¯ŒSజీసీ అధికారులు భద్రత, భరోసా కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేసిన డిమాం డ్లపై ఓఎ¯ŒSజీసీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. కాలనీలో ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాలు నిర్మించాలని, దీర్ఘకాలంగా నిల్వ ఉన్న చమురు తెట్టును సత్వరమే బయటకు తరలించాలని, అధునాతన సౌకర్యాలతో కాలనీని తరలించాలన్న డిమాం డ్లపై రాష్ట్ర ఓఎ¯ŒSజీసీ అసెట్‌ మేనేజర్‌ సన్యాల్‌తో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫో¯ŒSలో మాట్లాడి పరిస్థితిని వివరించి ఆమేరకు హామీ పొందారు. చమురు తెట్టును వారం రోజు ల వ్యవధిలో తరలిస్తామన్నారు. దీంతో ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.
     
మరిన్ని వార్తలు