కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు

3 Jan, 2017 00:07 IST|Sakshi
– చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్‌ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్‌
కర్నూలు (టౌన్‌): స్మార్ట్‌సిటీ పేరుతో కర్నూలు నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. విధి విధానాలు రూపొందించి కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ సి.హెచ్‌. విజయమోహన్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  కర్నూలు నగర పరిధిలో ప్రజల జీవన పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ.  33 కోట్లు మంజూరు చేయనుంది. చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించే ఈ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా నగరపాలక కమిషనర్, జిల్లా ఎస్పీ ఉంటారు.  షేర్‌హోల్డర్లుగా ప్రిన్సిపల్‌ ప్రత్యేక కార్యదర్శి, మున్సిపల్‌ డైరెక్టర్, పబ్లిక్‌ హెల్త్‌ సీఈ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్, అడిషనల్‌ కమిషనర్, ఎగ్జామినర్, ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఎస్‌ఈలు వ్యవహరిస్తారు. రూ. 5 లక్షలు విలువ చేసే షేర్లను రూ. 10 ప్రకారం 50 వేల షేర్లను రూపొందించారు.
మరిన్ని వార్తలు