పిచ్చి కుక్క స్వైర విహారం

27 Mar, 2017 23:24 IST|Sakshi
పిచ్చి కుక్క స్వైర విహారం

రాయచోటి రూరల్‌: పెమ్మాడపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గరుగుపల్లె, వడ్డెపల్లె, కొండోళ్లపల్లె గ్రామాలకు చెందిన 30 మందిపై పిచ్చికుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కొండోళ్లపల్లెలో ఆరుబయట నిద్రిస్తున్న 10 మందిని ఆ కుక్క కరిచింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో గరుగుపల్లె, వడ్డెపల్లెలో 20 మందిపై దాడి చేసింది. అలాగే ఆ మూడు గ్రామాల్లో 20 పశువులను కూడా కరిచిందని స్థానికులు తెలిపారు. గరుగుపల్లెకు చెందిన లక్ష్మీదేవి నుదుటున, వెంకటమ్మ మోచేతి పైన తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు గాయపడిన వారిలో రెడ్డెమ్మ, నాగులమ్మ , సిద్దన్న, ఓబులమ్మ, అంజలి , నాగసిద్దయ్య, జ్యోతి, అప్పన్న, పాపులమ్మ, ఆంజినేయులు, మల్లికార్జున తదితరులు ఉన్నారు. వారిని 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 10 మందిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అధికారులు చర్యలు తీసుకుని పిచ్చికుక్కలను అదుపు చేయాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు