Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం డ్రీమ్‌ హోమ్‌.. ఎక్కడో తెలుసా?

28 Sep, 2023 14:07 IST|Sakshi

ఇప్పుడున్న టాలీవుడ్‌ ఫ్యాన్స్‌కు ఈ పరిచయం అక్కర్లేని పేరు కిరణ్ ‍అబ్బవరం. రాజావారు రాణిగారు చిత్రంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో.  ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నారు. అనంతరం సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్‌ అంటూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. 

(ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్‌.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!)

ఇకపోతే సొంతింటి కల అనేది సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మైల్‌స్టోన్. అయితే తాజాగా మన హీరో కిరణ అబ్బవరం సొంతింటి కలను నిజం చేసుకున్నారు. కానీ కిరణ్ తన సొంత ఊర్లోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

మరిన్ని వార్తలు