విద్యకే తొలి ప్రాధాన్యం

29 Jul, 2016 19:17 IST|Sakshi
విద్యకే తొలి ప్రాధాన్యం
  • మంత్రి ఈటల రాజేందర్‌
  • శాతవాహన వర్సిటీని తనిఖీ చేసిన మంత్రి
  • కమాన్‌చౌరస్తా: శాతవాహన యూనివర్సిటీని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. వర్సిటీ పాలన విభాగం, నిర్మాణంలో ఉన్న ఆర్ట్స్‌ కళాశాల భవనం, సెంట్రల్‌ లైబ్రరీ, సైన్స్‌ కళాశాలను పరిశీలించారు. సైన్స్‌ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. భోజన శాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కళాశాల ఎదుట మొక్కలు నాటారు. ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని అని మంత్రి ఈటల అన్నారు. విద్యాభివృద్ధి కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గాని రూ. 10 కోట్ల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వర్సిటీ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు. విద్యాపర్యవేక్షణకు ఒక కమిటీని వేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కంప్యూటర్‌సైన్స్, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను త్వరలో రెగ్యూలర్‌ కోర్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు, వసతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 12–బీ గుర్తింపునకు కావాల్సి వనరులను అందిస్తామన్నారు.
    కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ కావాల్సిన గుర్తింపు, కేంద్రం నుంచి వచ్చే నిధులు త్వరగా వచ్చేలా చూస్తామని అన్నారు.  కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి,  కరీంన గర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్‌ రవీందర్‌సింగ్, శాతవాహన రిజిస్ట్రార్‌ ఎం.కోమల్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వై.కిశోర్, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సూరెపల్లి సుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు  సిద్దం వేణు, కట్ల సతీష్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్డవేని తిరుపతి, బోనాల శ్రీకాంత్, చల్లహరిశంకర్, బండారి వేణు, మల్లెంకి శ్రీనివాస్, సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌ వర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
     
     
>
మరిన్ని వార్తలు