నోట్ల కోసం నోళ్లొక్కటై..

25 Nov, 2016 23:59 IST|Sakshi
  • బ్యాంకుల వద్ద గిరిజనుల నిరసన
  •  
    పెద్ద నోట్ల రద్దు పెద్దవారికేమో కానీ చిన్నవారికి పెద్ద కష్టాలు తెచ్చిపెడుతోంది. రద్దు అయిన నోట్ల మార్పిడికి వెళ్తుంటే అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. విసుక్కుంటున్నారు.. బయటకు పొమ్మంటున్నారు. ఈ చర్యలను వారినుంచి ఊహించని ప్రజలు వారి నిరసనను వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రాస్తారోకో చేస్తే మరొకరు ధర్నా చేస్తున్నారు. ఒకరు బ్యాంకులను ముట్టడిస్తే మరొకరు ప్రజా సంఘాల సహకారంతో నిరసనప్రదర్శనలు చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    ముమ్మిడివరం :
    రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను డిసెంబర్‌ 30 వరకు కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మిడివరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బళ్ల గేటు సెంటర్‌ నుంచి స్టేట్‌బ్యాంక్‌ వరకు  ర్యాలీ నిర్వహించి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. రదై్దన నోట్లను డిసెంబర్‌ నెలాఖరు వరకు కొనసాగించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యులు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పనులు మానుకుని బ్యాంకులు వద్ద పడి గాపులు పడుతున్నార న్నారు. రూ.2వేల నోటు వల్ల సామాన్యలకు ప్రయోజనం లేదన్నారు. నోట్ల మార్పిడి వల్ల చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని  వారు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ, ఏఐటీయూ నాయకులు జి.దుర్గాప్రసాద్, వనచర్ల వెంకట్రావు, బీ.మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
    నగదు లేదు పొమ్మన్నారు
    మోతుగూడెం :  మోతుగూడెం ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులకు  అధికారులు రిక్త హస్తాలు చూపతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం బ్యాంకుకు వచ్చిన వారికి ఉదయం 11 గంట ల వరకు రూ.వెయ్యి ఇచ్చి, ఆ తర్వాత నగదు లేదు పొమ్మనారు. దీంతో ఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగినంత నగదు ఇస్తుంటే ఈ బ్యాంకుకు ఏప్పుడూ వచ్చిన నగదు నిల్వలు లేవనే చెప్పుతున్నారు. అలాంటప్పుడు బ్యాంకును తెరవడం ఎందు కు? మూసేయాలని ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ బ్యాంకు అధికారులు నగదు నిల్వలు సరిపడే విధంగా తేకుండా, తక్కువ నగదు తెచ్చి వారం రోజులుపాటు సర్దుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇకనుంచైన అధికారులు ఖాతాదారులకు ప్రభుత్వ ఆదేశించిన మేర నగదు చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు.
     
మరిన్ని వార్తలు