వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు

17 Jun, 2017 23:00 IST|Sakshi
  •  ఈ ఏడాది 3,100 ఎకరాల విస్తరణ లక్ష్యం
  • పట్టు పరిశ్రమశాఖ జేడీ సి.అరుణకుమారి
  • అనంతపురం అగ్రికల్చర్‌:  వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్‌)లో మల్బరీ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని పట్టు పరిశ్రమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సి.అరుణకుమారి ‘సాక్షికి తెలిపారు. ఈ ఏడాది 3,100 ఎకరాల్లో కొత్తగా మల్బరీ విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాలు ప్రారంభం కావడం, గరిష్ట ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో రేషం పెంపకానికి రైతులు మొగ్గు చూపిస్తున్నారని ఆమె తెలిపారు.

    ట్రీప్లాంటేషన్‌ పద్ధతి వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడినా సమస్య ఉండదన్నారు. ట్రీప్లాంటేషన్‌కు ఎకరాకు సబ్సిడీ రూపంలో రైతులకు 22,500 అందజేస్తామన్నారు. రైతులకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుండటంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ప్రతిపాదించామన్నారు. క్రాస్‌బ్రీడ్‌ (సీబీ) రకాన్ని తగ్గించి బైవోల్టీన్‌ రకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 44 లక్షల బైవోల్టీన్‌ గుడ్లు ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉపాధిహామీ కింద 250 షెడ్లు మంజూరయ్యాయన్నారు.  గతంలో మాదిరిగా అన్ని రకాల పథకాలు రాయితీతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మల్బరీకి మించిన లాభదాయకమైన పంట మరొకటి లేనందున రైతులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.  

మరిన్ని వార్తలు