అలరించిన సంగీత కచేరి

23 Sep, 2017 00:39 IST|Sakshi
అలరించిన సంగీత కచేరి

పుట్టపర్తి అర్బన్‌: శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిర్‌పురీ సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను పరవశింపజేసింది. ‘అచింత్య రూపిణి సాయిమా’ అంటూ సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు కచేరీ చేశారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజు రచించి హిందోళరాగంలో ఆలపించిన పాటలతో భక్తులు మైమరిపోయారు. ఇందులో మాతేశ్వరి పరమేశ్వరి, తుకారాం భైరవీ రాగంలో పాడిన ‘స్వామికృపాకరి కరణ’ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

మరిన్ని వార్తలు