నల్లవాగు.. పరవళ్లు

21 Sep, 2016 21:24 IST|Sakshi
నల్లవాగు ప్రాజెక్టు అలుగుపై నుంచి పొర్లుతున్న వరద నీరు

కల్హేర్‌: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగులో భారీగా వరద చేరింది. బుధవారం ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1493.166 ఫీట్లు ఉంది. మంగళవారం రాత్రి ఎగువ భాగంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షంతో భారీగా నీరు చేరింది. 400 క్యూసెక్కులు వరకు వరద నీరు ఇన్‌ఫ్లో ఉంది. 200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు అలుగు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మండలంలోని చెరువులకు జలకళ వచ్చింది.

మరిన్ని వార్తలు