ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు

26 Jul, 2016 19:35 IST|Sakshi
 
గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎన్‌సీసీ అంటే దేశభక్తితో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడమని ఎన్‌సీసీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ బి. హరికృష్ణ నాయుడు పేర్కొన్నారు. రింగ్‌రోడ్డులోని భాష్యం బ్లూమ్స్‌ సెకండరీ క్యాంపస్‌లో ఎన్‌సీసీ అకాడమీని ప్రారంభించారు. ఎన్‌సీసీ యూనిట్‌ 25 (ఏ) బెటాలియన్‌ కల్నల్, గ్రూప్‌ కమాండర్‌ బి. హరికృష్ణ నాయుడు, కమాండింగ్‌ అధికారి సునీల్‌ యాదవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్‌సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా అమర జవానులకు నివాళిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా హరికృష్ణ నాయుడు మాట్లాడుతూ ఎన్‌సీసీ అంటే సర్టిఫికెట్‌ పొందడమే కాదని, దేశభక్తి, మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు, లౌకిక వాదం, సేవా దృక్పథం, దేశం కోసం పాటు పడే మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 2016–17 హెడ్‌ బాయ్స్, హెడ్‌ గర్‌్ల్స కెప్టెన్స్, హౌస్‌ కెప్టన్స్‌ కల్నల్‌ చేతుల మీదుగా షోల్డర్, చెస్ట్‌ బ్యాడ్జెస్‌ గౌరవాన్ని అందుకుని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు