విజ్ఞానశాస్త్రాల అనుసంధానంతో నూతన ఆవిష్కరణలు

2 Aug, 2016 00:36 IST|Sakshi
విజ్ఞానశాస్త్రాల అనుసంధానంతో నూతన ఆవిష్కరణలు
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : విజ్ఞానశాస్త్రాల అనుసంధానంతో మెరుగైన ప్రయోగాలు చేస్తూ ఎన్నో నూతన అంశాలను ఆవిష్కరించవచ్చని శ్రీసత్యసాయి విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.బాపిరాజు అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సదస్సులో ‘స్ఫటిక విజ్ఞాన శాస్త్రం యొక్క వివిధ అనువర్తన అంశాల’ను దృశ్య రూపంలో ఆయన వివరించారు. స్ఫటిక విజ్ఞాన శాస్త్రం, నానో సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఆవిçష్కరణలు జరుగుతున్నాయన్నారు. భౌతిక, జీవ, వృక్ష, రసాయన శాస్త్రాల అనుసంధాన పరిశోధనల ద్వారా కొత్త ఆవిష్కరణలు చేయవచ్చన్నారు. ఆయనను వీసీ ముత్యాలునాయుడు దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి గురుకులం ఇన్‌చార్జ్‌ శ్యాంసుందరం, రిజి్ర్టార్‌ డాక్టర్‌ కేఎస్‌ రమేష్, ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ పి.సురేష్‌వర్మ, డాక్టర్‌ మట్టారెడ్డి, డీన్‌ డాక్టర్‌ ఎస్‌.టేకి, డాక్టర్‌ పెర్సిన్‌ పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు