ఆరుబయటే భోజనాలు

29 Sep, 2016 23:16 IST|Sakshi
ఆరుబయట కూర్చొని తింటున్న విద్యార్థినులు
సాలూరు రూరల్‌ : మండలంలోని కొత్తవలస గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో భోజనాలు చేసేందుకు ప్రత్యేక గది లేదు. దీంతో విద్యార్థినులు ఆరుబయటే భోజనాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలకు గదులు కారుతుండడంతో డార్మెటరీ, తరగతి గదులతో పాటు ఆరుబయట తినాల్సి వస్తోందని విద్యార్థినులు చెబుతున్నారు. కొత్తగా నిర్మించిన  భవనానికి తలుపులు,  కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని వాపోతున్నారు. ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎం గునరాజు మాట్లాడుతూ, భోజనాలకు గది నిర్మించాలని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు చెప్పారు.  
 
 
>
మరిన్ని వార్తలు