అమ్మో..ఆస్పత్రి!

19 Mar, 2016 03:46 IST|Sakshi
అమ్మో..ఆస్పత్రి!

భెల్ దవాఖానాకు బూజు
లోపించిన పారిశుద్ధ్యం
రావడానికి జంకుతున్న రోగులు
పసికందులపైనా నిర్లక్ష్యమే..

భెల్: భెల్ కాలనీలోని ఆస్పత్రిలోకి వెళితే గుండె గుభేల్ మనడం ఖాయం.. ఆస్పత్రిలో ఎటు చూసినా పారిశుద్ధ్య లేమి.. బూజు పట్టిన గోడలు, పరికరాలే దర్శనమిస్తాయి. రోగులు ఇక్కడికి  రావాలంటే భయపడుతున్నారు. బీహెచ్‌ఈఎల్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కోసం భెల్ కాలనీలో ఆస్పత్రిని నిర్మించారు. కాని నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగు లు నరక యాతన అనుభవిస్తున్నారు. రోగం నయం కోసం వస్తే.. కొత్త రోగాలతో బయటకు వెళ్లాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. నిర్వహణ కోసం ఏటా రూ. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. కనీసం బూజు దులపలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పారిశుద్ధ్యంపై కూడా శ్రద్ధ చూపడంలేదని కార్మికులు మండిపడుతున్నారు.

వైద్య సేవలు కూడా సరిగా లేవని రోగులు వాపోతున్నారు. అప్పుడే పుట్టిన పసికందులను  ఉంచడానికి ఏర్పాటు చేసిన వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టి ఉంది. దీనిపై బలింతలు, వారి కుటుంబ సభ్యులు చూసి తమ పిల్లలకు ఎటువంటి క్రీమికిటకాలు చేరి ఇన్ఫెక్షన్ వస్తే పరిస్థితి  ఏమిటని భయందోళనకు గురువుతున్నారు. చిన్నారుల వార్డుల్లోకి వచ్చిపోయే బంధువులను ఆరోగ్య నియమాలను పాటించాలని డాక్టర్లే పదేపదే చెప్పుతుంటారు.  పాదరక్షలు వదలనిదే లోపలికి అనుమతించరు. మరి అటువంటి  వైద్యులకు, అసుపత్రి వర్గాలకు, భెల్ యాజమాన్యానికి చిన్నారుల వార్డుల్లోనూ అపరిశుభ్రత కనిపించడంలేదనా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భెల్ యాజమాన్యం అసుపత్రి వైద్యంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 అన్నీ సమస్యలే....
బీహెచ్‌ఈఎల్ అసుపత్రిలో చికిత్స పొందే ప్రతి రోగి నరకం చూస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికూనలను సైతం అపరిశుభ్ర వాతావరణ వార్డుల్లో పెట్టడం విడ్డూరం. ఈ దవాఖానాకు రావడానికి రోగులు జంకుతున్నారు. అంతేకాకుండా మరమ్మతుల పేరుతో కార్పొరెట్ ఆస్పత్రులకు తరిలించి కోట్లాది రుపాయాలు వృధా చేస్తున్నారు. -జాషువ, కార్మిక నాయకుడు

>
మరిన్ని వార్తలు