ఉపాధ్యాయులు లేరని..

25 Nov, 2016 21:31 IST|Sakshi
ఉపాధ్యాయులు లేరని..
- శిరుగాపురంలో పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు
 
శిరుగాపురం(హాలహర్వి) : ఉపాధ్యాయులు లేని పాఠశాల ఎందుకని శిరుగాపురం గ్రామస్తులు శుక్రవారం పాఠశాలకు  తాళం వేశారు  ఈ స్కూల్‌లో 1 నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్‌పై శ్రీధరహాల్‌ గ్రామ పాఠశాలకు వెళ్లారు. మరో ఉపాధ్యాయుడు సెలవులపై వెళ్లాడు. దీంతో శుక్రవారం విద్యార్థులకు చదువులు చెప్పేవారు లేరు.  టీచర్లను నియమించాలని పలుమార్లు విన్నవించినా ఎంఈఓ పట్టించుకోవడం లేదని  ఆగ్రహించిన గ్రామస్తులు  సోమన్న, ఓంకార్‌గౌడు, మల్లికార్జున శుక్రవారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.  ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాల తలుపులు తెరవనివ్వమని వారు చెప్పారు.  దీనిపై ఎంఈఓ రాజన్న వివరణ కోరగా త్వరలోనే డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.  
 
మరిన్ని వార్తలు