పంచాయతీల్లో ఈ-సేవలు

1 Sep, 2016 19:17 IST|Sakshi

సంగారెడ్డి రూరల్‌: మండల పరిధిలోని అన్ని గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ సంధ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎర్ధనూర్, చిద్రుప్ప, తాళ్ళపల్లి, జుల్‌కల్‌  పంచాయతీలకు నాలుగు కంప్యూటర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ మండలంలో 27కు గాను ఇప్పటి వరకు 18 పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశామన్నారు. ఆయా గ్రమాలను ఈ పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన ట్యాక్స్‌ల చెల్లింపులు, నిధుల వివరాలు, ఇళ్ల నిర్మాణల అనుమతులు, వివిధ రకాల ధ్రువీకరణపత్రాలను ప్రభుత్వ పథకాలకోసం వచ్చే దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్‌ గోపాల్, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చిల్వేరి ప్రభాకర్,  నాయకులు అశోక్, రమేష్, ఎర్దనూర్, బ్యాతోల్‌ సర్పంచులు అనంతయ్య, శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు శారద, శ్రీకాంత్, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు