నేటి నుంచి వరిధాన్యం కొనుగోలు

10 Aug, 2016 22:42 IST|Sakshi
రైస్‌మిల్లర్ల యజమానులు, అధికారులతో సమీక్షిస్తున్న జేసీ గిరీష
– మద్దతు ధర క్వింటాల్‌కు  రూ.1,450 
– ఏడు మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 
– జేసీ గిరీష 
చిత్తూరు (కలెక్టరేట్‌): 
రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గురువారం నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీష తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరికి మద్దతు ధరను ఏ గ్రేడు వరికి క్వింటాల్‌కు రూ.1,450, బీ గ్రేడు క్వింటాల్‌కు రూ.1,410 చొప్పున ప్రకటించిందన్నారు. జిల్లాలో తూర్పు మండలాల్లో ఈ ఖరీఫ్‌కు 10 వేల హెక్టార్లలో వరిపంట సాగవుతుందన్నారు. ఇందుకుగాను దాదాపు 25 వేల టన్నుల మేరకు వరిధాన్యం దిగుబడి అవుతుందని, అందులో కనీసం 15 వేల టన్నులు కొనుగోలు చేసే విఈంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మిల్లర్లు సహకారాన్ని అందించాలని ఆయన తెలియజేశారు. కొనుగోలుకు అవసరమైన నిధులు కూడా 3.04 కోట్ల మేరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, బీఎన్‌ కండ్రిగ, వరదయ్యపాళ్యం, నాగలాపురం, పిచ్చాటూరు, తొట్టంబేడు, కెవీబీ పురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 
ఈ కింది నెంబర్లను సంప్రదించండి 
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇందుకుగాను పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు 702003533, డీఎస్‌వో 8008201423, జిల్లా మేనేజరు కార్యాలయం 08572 242040, డీఆర్‌డీఏ పీడీ 7032522333, ఏడీ మార్కెటింగ్‌ 9505517203, జిల్లా సహకారశాఖ అధికారి 9100109216 లను సంప్రదించాలని జేసీ  తెలియజేశారు. 
 
 
మరిన్ని వార్తలు