15మందిపై పీడీ యాక్ట్‌

29 Jul, 2016 22:49 IST|Sakshi
పార్వతీపురం : ఇటీవల దొరికిన నల్లబెల్లం కేసులో 15 మందిపై పీడీ యాక్ట్‌ పెడుతున్నట్లు ఎక్సైజ్‌ సీఐ ఎస్‌.విజయకుమార్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత మంగళవారం జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామంలో జరిపిన దాడుల్లో  2,068 కేజీల నల్ల బెల్లం, 50కేజీల అమ్మోనియ, 20  లీటర్ల నాటుసారా, గ్రామ పరిసర ప్రాంతాల్లో 2 అల్యూమినియం విజల్స్, 2 అల్యూమినియం పోర్ట్స్, 50 కేజీల అమ్మోనియం లభించినట్లు తెలిపారు. ఈ నేరంలో  రాయిపిల్లి రాజు, మండంగి గౌరీశంకరరావు, రాయిపిల్లి రమేష్, గంటామోహన్, రాయిపిల్లి ఉమామహేశ్వరరావు, మెరుపుల తిరుపతిరావు, పరిటి పోలినాయుడు, పాలవలస ఉమ, బొమ్మాళి యోగీసు, నాగళ్లు అప్పలస్వామి, బొమ్మాళి ప్రకాష్, గరుగుబిల్లి తాతబాబు, గరుగుబిల్లి శ్రీరాములు, దొనక కన్నయ్య, చింతాడ కుమార్‌ల ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమమందిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో సహకరించినఎస్సై జె.రాజశేఖర్, సిబ్బందిని ఆయన అభినందించారు. 
 
మరిన్ని వార్తలు