టీచర్‌ జనార్దన్‌పై ఉదాసీనత..!

14 Oct, 2016 23:28 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్‌ స్కూల్‌లో ఎస్‌జీటీగా ఉన్న జనార్ధన్‌పై నగరపాలక సంస్థ అధికారులు ఉదాసీనత ప్రదర్శించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితం భార్యను మతి కేసులో జనార్ధన్‌ను రిమాండ్‌కు పంపిన విషయం విధితమే. అతనిపై క్రైమ్‌ నెంబర్‌ 156/16 నమోదైంది. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయ సంఘాలు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

క్రైం నంబర్‌ వచ్చాక కూడా అతన్ని సస్పెండ్‌ చేయకుండా అధికారులు జాప్యం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి నేతల జోక్యంతోనే సస్పెన్షన్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ విషయమై డిప్యూటీ కమిషనర్‌ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్‌ కాపీ  ఇవ్వాలని  త్రీ టౌన్‌ పోలీసులను కోరామన్నారు. అవి అందగానే చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు