‘బతుకు’ పోరు

17 Aug, 2017 00:38 IST|Sakshi
‘బతుకు’ పోరు

అనంపురం ఎడ్యుకేషన్‌: డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది. నేటికీ ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బతుకు పోరులో ఎన్నో కష్టనష్టాలను వారు చవిచూస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

విద్య, వైద్య వారికి అందని ద్రాక్షగా మారింది. కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారి దరి చేరడం లేదు. ఇలాంటి ఓ కుటుంబంలోని ముగ్గురు.. బుధవారం అనంతపురం నగరంలోని డ్రెయినేజీల్లో ఇనుప ముక్కలు ఏరుకుంటూ ఇలా కనిపించారు. తమకు లభ్యమైన ఇనుప ముక్కలను గుజరీలో విక్రయించి, వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు