సమస్యల పరిష్కారం కోసమే ‘పల్లె వికాసం’

27 Jul, 2016 00:24 IST|Sakshi
ఆకునెల్లికుదురు(తాడూరు): గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసమే పల్లె వికాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి నాగార్జునరెడ్డి అన్నారు. పల్లె వికాసంలో భాగంగా మంగళవారం మండలంలోని ఆకునెల్లికుదురు గ్రామాన్ని  సర్పంచ్‌ ముచ్చర్ల చంద్రమౌలి ఆధ్వర్యంలో వారు సందర్శించారు.  పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల పనితీరు, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చిన్నారులు, గర్భిణులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను నిర్మించి ఏడాది కావస్తున్నా బిల్లు రాలేదని జంగయ్య వాపోయాడు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిశీలించారు.  కార్యక్రమంలో ఎంపీడీఓ కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ టి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ చంద్రసిద్ధార్థ, ఐకేపీ ఏపీఎం ఈశ్వర్,   రవీందర్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు