డబ్బుల కోసం తప్పని పాట్లు

31 Dec, 2016 03:34 IST|Sakshi
డబ్బుల కోసం తప్పని పాట్లు

నెల గడుస్తున్నా తీరని ఇబ్బందులు
►  గోపాల్‌రావుపేటలో భారీ క్యూలైన్


రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పేద ప్రజలకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. నోట్లు రద్దు చేసి నెల రోజులు కావస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపించడంలే దు. బ్యాంకుల చుట్టు నిత్యం ఖాతాదారులు తిరిగి ఇబ్బందిపడుతున్నారు. బ్యాంకులకు వెళ్లి రోజంతా క్యూలైన్ కట్టినప్పటికీ చేతికి మాత్రం డబ్బులు అందడంలేదని గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన లక్ష్మి అవేదన వ్యక్తం చేశా రు. గోపాల్‌రావుపేట గ్రామంలో ఆంధ్రాబ్యా ంకులో మంగళవారం మహిళలు డబ్బుల కోసం భారీగా తరలివచ్చారు. అధికారులు రూ.నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేలు ఇస్తున్నారని పలువురు ఖాతాదారులు తెలిపారు. రామడుగులోని ఆంధ్రాబ్యాంకు, వెదిర గ్రామం లో సిండికెట్ బ్యాంకు వద్ద డబ్బుల కోసం పెద్దఎత్తున  ఖాతాదారులు క్యూకట్టి నిలబడ్డారు. కాగా ప్రభుత్వ నోట్ల రద్దు చేయడంతో తమ డబ్బులు కూడా తాము తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వెదిర గ్రామానికి చెందిన సంపత్ తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ నోట్ల ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు.  
 

మరిన్ని వార్తలు