ప్రజల సమస్య ప్రభుత్వానికి పట్టదా?

16 Nov, 2016 22:13 IST|Sakshi
తుని :
ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఎంతసేపూ తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే సీఎం పరిమితమయ్యారన్నారు. తుని శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి వారం అవుతోందని, ఇంతవరకూ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ప్రతిపక్షాలపై పోలీసులు చేత కేసులుపెట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తొండంగి మండలం కోన  ప్రాంతంలో కాలుష్యం వెదజల్లే దివీస్‌ పరిశ్రమ కోసం అక్కడి ప్రజలను సమస్యల్లోని నెడుతున్నాయన్నారు. దివీస్‌ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగ¯ŒSమోß毌S రెడ్డి ఈ నెల 22న తొండంగి మండలానికి వస్తున్నారన్నారు. అక్కడ జరిగే జగ¯ŒS బహిరంగ సభను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంత చేయాలని రాజా కోరారు.
 
మరిన్ని వార్తలు