పౌష్టికాహారమా! విషమా?

18 Jan, 2017 23:04 IST|Sakshi
  • గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని ఆహారమా? 
  • ఐసీడీఎస్‌ పీఓపై వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం
  • కోరుకొండ (రాజానగరం) :
    అన్నా అమృత హస్తం పేరుతో అంగ¯ŒSవాడీ సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతలేమితో విషపూరితమైన ఆహారంగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్న కోరుకొండ ఐసీడీఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కోరుకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన  ఆమెను కొంతమంది గర్భిణులు, బాలింతలు కలుసుకుని అంగ¯ŒSవాడీ కేంద్రాల ద్వారా తమకు నాసిరం సరుకులు సరఫరా చేస్తున్నారంటూ పాడైన పాల ప్యాకెట్లు, చిన్నసైజు కోడిగుడ్లు, పుచ్చుపట్టిన కందిపప్పు, పురుగు పట్టిన బియ్యాన్ని చూపించారు. దీంతో ఆగ్రహించిన జక్కంపూడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల అంగ¯ŒSవాడీ కార్యకర్తలతో జరుగుతున్న సదస్సుకు వెళ్లి పీఓ సీతారామలక్షి్మని నిలదీశారు. అ«ధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారా?
    ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం పేరుతో ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
    నాలుగు నెలలుగా జీతాలు లేవు 
    అంగ¯ŒSవాడీ కేంద్రాలను బలోపేతం చేసే కార్యకర్తలు ఆకలి బాధలతో అలమటిస్తూ చురుగ్గా ఏ విధంగా విధులు నిర్వర్తించగలరని విజయలక్ష్మి ప్రశ్శించారు. అంగ¯ŒSవాడీ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రాని విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారు. అన్న అమృతహస్తం పథకం ద్వారా నాసిరకం సరుకులను అందిస్తూ అధికార పార్టీకి చెందిన పెద్దలే నిధులు మింగేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక అధికారిగా బాధ్యతను విస్మరించి విధులు నిర్వర్తిస్తే ఫలితం ప్రజలపై పడుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. 
    పీఓ వేధింపుల నుంచి రక్షణ కల్పించండి 
    పీఓ వేధింపులను భరించలేకపోతున్నామని, ఆమె బారి నుంచి రక్షించాలని పలువురు అంగ¯ŒSవాడీలు విజయలక్షి్మని కోరారు. ఇకపై నాణ్యత ఉన్న సరుకులనే అందజేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ ïపీఓ సీతారామలక్ష్మి అందరూ సమక్షంలో హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.   విజయలక్ష్మి వెంట వైఎస్సార్‌ సీపీ రైతు కన్వీనర్‌ తోరాటి శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, వాకా నరసింహరావు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్‌ అధ్యక్షులు అడపా శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి ఐల శ్రీను, మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ జిలానీ, మండల పార్టీ నాయకులు పాలం నాగవిష్ణు, సూరిశెట్టి అప్పలస్వామి, ముద్దా అణు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు. 
     
మరిన్ని వార్తలు