‘సన్‌’దోహం

3 Feb, 2017 22:58 IST|Sakshi
‘సన్‌’దోహం
  • అంబరాన్నంటిన రథసప్తమి వేడుకలు
  • భక్తులతో కిటకిటలాడిన  సూర్యనారాయణ మూర్తి ఆలయాలు
  • ఆదిత్యుడికి ఘనంగా పూజలు ∙వైభవంగా రథోత్సవాలు
  • జి.మామిడాడ(పెదపూడి) : 
    రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణ మూర్తి స్వామి వారి రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు భక్తులు ఆలయ ప్రాంగణంలో సూర్యనమస్కారాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక, విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో సిద్ధం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం   సూర్యభగవానుని దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవ మూర్తులతో కలిసి పల్లకిలో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయించి,  ఆలయం బయట ఉంచిన రథంలో పెట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, భక్తులు, గ్రామయూత్‌ సూర్యనారాయణ నామస్మరణతో ఉత్సహంగా రథాన్ని ముందుకు లాగారు. ఆలయ ఈఓ మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ «వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు, అమృతకుండి ప్రసాద వినియోగాలు నిర్వహించారు.
    ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 
    రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు.
     
    అంతర్వేదిలో రథసప్తమి వేడుకలు...
    మలికిపురం, సఖినేటిపల్లి : రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఇంటింటా సూర్యభగవానుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లోకబాంధవుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనను భక్తులు భక్తిశ్రద్థలతో కొలిచారు. తొలి సంధ్యవేళ లేలేత సూర్యకిరణాలు మధ్య భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శిరస్సు, భుజాలపై తెల్లజిల్లేడు ఆకులు, రేగిపండ్లు పెట్టుకుని, సంప్రదాయ ప్రకారం స్నానాలు చేశారు. ఇంటింటా భక్తులు క్షీరాన్నం వండి, చిక్కుడు ఆకులపై పెట్టి, శ్రీసూర్యనారాయణ స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో భక్తులు స్వామికి పూజలు నిర్వహించారు. అంతర్వేదిలో వేకువజామున నుంచి సముద్ర స్నానాలు ఆచరించి వచ్చిన భక్తులతో శ్రీలక్షీ్మనృసింహస్వామి ఆలయం కిక్కిరిసింది. 
     
    అమరగిరిమెట్టపై సూర్యభగవానునికి పూజలు
    పెద్దాపురం : స్థానిక అమరగిరి మెట్ట (పాండవుల మెట్ట)పై కొలువై ఉన్న సూర్యనారాయణమూర్తికి రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ సూరిబాబురాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ నిర్వాహకులు వాణి, లక్ష్మి ఆయన వేదపండితుల మంత్రోచ్ఛరణల మ««దl్య ఘన స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు.
     
    పంచారామ క్షేత్రంలో ..
    సామర్లకోట : స్థానిక పంచారామ క్షేత్రంలోని సూర్యనారాయణమూర్తికి శుక్రవారం పూజలు, అభిషేకాలు, కల్యాణం నిర్వహించారు. అన్నదాన ట్రస్టు నాయకుడు బిక్కిన సాయి పరమేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయ అభిషేక పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, వేదపండితులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న పూజలు నిర్వహించారు. ఈవో పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS కంటే జగదీష్‌మోహనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  
     
మరిన్ని వార్తలు