మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు

7 Oct, 2016 01:07 IST|Sakshi
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు
 
  •  డీఆర్‌డీఏ పీడీ లావణ్యవేణి 
 
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని 43 పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు మంజూరైనట్లు డీఆర్‌డీఏ పీడీ లావణ్యవేణి తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో వెలుగు ఏపీఎంలు, ఏసీలు, డీపీఎంలతో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 10వ తేదీలోగా 3వేల కంపోస్టు తొట్టెలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమాలో సభ్యులను చేర్పించాలని ఏపీఎంలను ఆదేశించారు. పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. డీఆర్డీఏ ఏపీడీ ప్రసన్నలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు