గ్రహం అనుగ్రహం, శుక్రవారం 7, అక్టోబర్ 2016

7 Oct, 2016 01:07 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 7, అక్టోబర్ 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం, తిథి శు.షష్ఠి ప.3.15 వరకు,
తదుపరి సప్తమి
నక్షత్రం జ్యేష్ఠ ఉ.11.25 వరకు, తదుపరి
మూల, వర్జ్యం రా.8.00 నుంచి 9.45 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు,
తదుపరి ప.12.13 నుంచి 1.02 వరకు,
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం    :    5.54
సూర్యాస్తమయం    :    5.48
రాహుకాలం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు
 
 భవిష్యం
మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. బంధువులు, మిత్రులతో కలహాలు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
 
వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
 
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
 
కర్కాటకం: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.
 
సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
 
కన్య: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
 
తుల: కొత్త వ్యక్తుల పరిచయం.శుభవార్తా శ్రవణం. రుణాలు తీరతాయి. ఆస్తి,ధనలాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
 
వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.
 
ధనుస్సు: రాబడి ఆశాజనకం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిణామాలు.
 
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు పనిభారం.
 
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
 
మీనం: ఉద్యోగ లాభం. యత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.
 -  సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు