పర్వేందర్‌ కోసం పంజాబ్‌కు..

13 Jan, 2017 00:56 IST|Sakshi
పర్వేందర్‌ కోసం పంజాబ్‌కు..

తీవ్ర ప్రయత్నాల్లో రూరల్‌ పోలీసులు

నిజామాబాద్‌ రూరల్‌ (మోపాల్‌) : రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌ గ్రామశివారులో డిసెంబర్‌ 8వ తేదీన పాతనోట్ల మార్పిడి చేసి ఇస్తామని రూ.14లక్షలతో పారిపోయిన పర్వేందర్‌ సింగ్‌ కోసం సౌత్‌జోన్‌ రూరల్‌పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పంజాబ్‌ రాష్ట్రానికి వెళ్లారు. రెండురోజులుగా అక్కడ తీవ్రంగా గాలిస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌ఎచ్‌వో ఇందూరు జగదీష్‌ ఆధ్వర్యంలో ఐడీపార్టీ హెడ్‌కానిస్టేబుళ్లతో కూడిన బృందం పంజాబ్‌కు బయలుదేరి వెళ్లింది. రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాగైనా నిందితుడి ని పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. గత నెలలో సంఘటన జరగగానే ఎస్సై చందర్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన పోలీసు బృందం వారం రోజుల తరువాత తిరిగొచ్చారు.  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి పర్వేం దర్‌సింగ్‌ పాస్‌పోర్టు, వీసా ఆయన ఏ ప్రాంతాలకు వెళ్లాడనే కోణంలో విచారణచేసి వచ్చారు.

అయితే కోర్టులో లొంగిపోతాడని ప్రచారం జరిగినప్పటికీ తర్వాత ఎలాం టి స్పందనా లేదు. ఈ సంఘటనలో నిందితులు పర్వేం దర్‌ సింగ్, కమల్‌లు బాధితులకు పిస్తోలు, తల్వార్‌ చూ పి బెదిరించి డబ్బులతో కారులో పారిపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనలో నిందితుల్లో కమల్‌జిత్‌ సింగ్, కరణ్‌బీర్‌సింగ్, జగ్‌ప్రీత్‌సింగ్, అలియాస్‌ జగ్గాలను పోలీసులు డిసెంబర్‌లో అరెస్ట్‌ చేశారు. వీరు పంజాబ్‌కు చెందిన వారిగా విచారణలో తేలిందని రూరల్‌  స ర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఇందూరు జగదీష్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు