రాజీవ్‌ హయాంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి

21 Aug, 2016 00:24 IST|Sakshi
రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలు వేస్తున్న సత్యం

 

  • డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం


ఖమ్మం: భారత మాజీ ప్రధాని,రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఐతం సత్యం రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మయూరి సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా ఐతం సత్యం మాట్లాడుతూ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల వైపు పయణించేలా దారులు వేసిన మహా నేత రాజీవ్‌గాంధీ అన్నారు.ఆయన కృషి ఫలితంగానే నేడు దేశం ప్రపంచ దేశాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతుందని అన్నారు.  కార్యక్రమంలో నాయకులు కొత్తా సీతారాములు, పుల్లిపాటి వెంకటయ్య, వీవీ అప్పారావు, బండి మణి, గాదెల ఝాన్సీ, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, తాజొద్దిన్, ఫజల్, బాలాజీరావునాయక్‌ పాల్గొన్నారు.
 యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..
యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో సద్భావనా ర్యాలీ చేపట్టారు. అనంతరం  రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్, క్రాంతికుమార్, అబ్దుల్‌ అహద్, సతీష్, సాయి, ఖలీక్, నజర్, పాలుక్‌  పాల్గొన్నారు.
 త్రీటౌన్‌ ఏరియాలో..
ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ ఏరియాలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఏరియా యుత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యువతకు రాజీవ్‌గాంధీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మ«ధు,బాలగంగాధర్, కార్తీక్, వెంకటేష్, ఉపేందర్, జమీల్, జావిద్‌ పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు