ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన

21 Aug, 2016 00:32 IST|Sakshi
ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన
ములుగు : ములుగు డివిజన్‌ను సమ్మక్క, సారల మ్మ పేరిట జిల్లా చేయాలని కోరుతూ అఖిల పక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శని వారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక జాతీయ 163 రహదారిపై టైర్లు దహనం చేసి, ధర్నా, రాస్తారోకో, మానవహారం చేపట్టారు.
 
విషయం తెలుసుకున్న ఎస్సై మల్లేశ్‌యాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతిపజేశారు. అనంతరం అఖిలపక్షం, జిల్లా సాధన సమితి అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ముంజాల భిక్షపతిగౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, బీజే పీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేముల భిక్షపతి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ములుగును మేడారం సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
 
ప్రజాభిప్రాయాలు సేకరించకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను విభజిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోమన్నారు. ములుగును కాదని భూపాలపల్లిని జిల్లా చేసినట్లయితే ములుగును అగ్ని గుండంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ములుగు జిల్లా కాకుంటే అందుకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో కుల సంఘాల నాయకుల జేఏసీ చైర్మన్‌ గండి కుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి ముసినేపల్లి కుమార్, నాయకులు కారుపోతుల యాదగిరి, కోగిల రాంబాబు, బొమ్మకంటి రమేశ్, వంగ రవియాదవ్, శత్రజ్ఞుడు, కనకం దేవదాస్, కోరె రవియాదవ్, సంపత్, ఎల్కతుర్తి  శ్రీహరి, మునీంఖాన్, రవిపాల్, బాబాఖాన్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు