ముక్కంటి దర్శనం వేళలు మార్పు

12 Dec, 2016 13:53 IST|Sakshi
ముక్కంటి దర్శనం వేళలు మార్పు

శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా ఈనెల 16 నుంచి జనవరి 15 వరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనం వేళలు మారుస్తున్నట్లు ఆలయాధికారులు ఆదివారం తెలిపారు. మాములుగా తెల్లవారుజామున 5.30 నుంచి ఆలయంలో దర్శనం ధనుర్మాసంలో 5 గంటల నుంచే ఉంటుంది. వేకువున 3.30 గంటలకు నిర్వహించే జేగంటను 3 గంటలకు నిర్వహిస్తారు. 4.30Sకు జరిగే మంగళవాయిద్యాల కార్యక్రమం 4 గంటలకే ఉంటుంది. 5 గంటలకు జరిగే సుప్రభాతం 4.30 గంటలకు ఉంటుంది.

ఉదయం 5.30 గంటలకు నిర్వహించే మొదటి అభిషేకం 5 గంటలకే నిర్వహించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. 6.30 గంటలకు జరిగే రెండో అభిషేకం 6 గంటలకే ఉంటుంది. 7.30 గంటలకు జరిగే పరివార దేవతలకు పూజలు 7 గంటలకే నిర్వహిస్తారు. 7.30 గంటలకు గొబ్బి ఉత్సవం ఉంటుంది. 10.30 గంటలకు జరిగే మూడో అభిషేకం 10 గంటలకే పూర్తి చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ప్రదోష అభిషేకం మాత్రం యథావిధిగానే నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు